Telangana : నాడు తొడగొట్టి.. నేడు కాళ్ళ బేరం..!

రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి పాలకుల అవినీతి అక్రమాలను వెలుగు తీసే చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి , నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి పై కాలు దువ్వి తొడగొట్టిన మల్లారెడ్డి కథ ఇది.

Telangana : నాడు తొడగొట్టి.. నేడు కాళ్ళ బేరం..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి పాలకుల అవినీతి అక్రమాలను వెలుగు తీసే చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి , నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి పై కాలు దువ్వి తొడగొట్టిన మల్లారెడ్డి కథ ఇది.

రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీని , రేవంత్ రెడ్డిని చీల్చి చెండాడిన మాజీ మంత్రి మల్లారెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే.? కుడ్తిలో పడ్డ ఎలుకలా.. మారింది. రా.. రా.. చూసుకుందాం. సాలే.. అంటూ తొడగొట్టిన మల్లారెడ్డి ఇప్పుడు కాల్ల బేరానికి వచ్చారా..? అనిపిస్తుంది. అప్పట్లో మల్లారెడ్డి తొడగొట్టి సవాల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

దమ్ముంటే రా మల్కాజిగిరిలో ఈసారి నేను పోటీ చేస్తా అని సవాల్ విసిరి న మల్లారెడ్డి పరిస్థితి ఇప్పుడు ఏమైంది అంటే తన కొడుకు భద్రారెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ వద్దు.. మా కుటుంబం పోటీ చేయదు అనే పరిస్థితి వరకు వచ్చింది.

ALSO READ :

Rythu Bandhu : రైతు బంధు అందరికీ ఇవ్వరా.. ఒక ఎకరం ఉన్న వారికి రాదా..!

రాజకీయాల్లో వ్యక్తిగత శత్రువులను పెంచుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని మల్లారెడ్డిని చూస్తే అర్థమవుతుంది. మల్లారెడ్డి అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి విద్యాసంస్థలలో అక్రమ కట్టడాలు నిర్మించారని, ఇటీవల ఫిర్యాదులు అందాయి. దాంతో మున్సిపల్ అధికారులు వారి కళాశాల భవనాలను కూల్చివేయడంతో పాటు, మల్లారెడ్డి కళాశాలకు వెళ్లే రోడ్డును కూడా తొలగించారు.

ఇలాంటి పరిస్థితులలో మల్లారెడ్డి అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన వాళ్లకు సమయం ఇవ్వలేదని తెలిసింది. దాంతో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో ఇటీవల వారిని వారిరువురూ సమావేశమయ్యారు. దాంతో ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని ప్రచారం జోరుగా సాగింది. ఈ మేరకు మల్లారెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కూడా కబురు పెట్టారు.

ALSO EAD : 

MallaReddy : కెసిఆర్ నుంచి మల్లారెడ్డికి కబురు.. భేటీ అయిన మల్లారెడ్డి..!

ఆయనను కలిసిన మల్లారెడ్డి కూడా పార్టీ మారబోనని స్పష్టం చేసినట్లు తెలిసింది. కానీ మల్కాజిగిరి పార్లమెంటు టికెట్ తమ కుటుంబానికి వద్దని నిర్ణయించినట్లు సమాచారం. రాజకీయ భవిష్యత్తు కాకుండా ఆయన విద్యాసంస్థల అక్రమాలు, వ్యాపారాలు, ఆక్రమణలపై ప్రభుత్వం దృష్టి పెట్టే ఆలోచన ఉన్నట్లు సమాచారం. దాంతో మల్లారెడ్డి ఏం చేయలేని పరిస్థితిలో ఉండి రేవంత్ రెడ్డితో కార్ల బేరానికి వచ్చినట్లు తెలుస్తుంది. పార్టీ మారితే అక్రమాలు దాచుకోవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతుంది.

అధికారం ఎటు ఉంటే అటు వెళ్తాడా ..?

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీలో ఉన్న మల్లారెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి వెళ్లి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కండువా మార్చాలని చూస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. మొదట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న మల్లారెడ్డి ఆ పార్టీ తెలంగాణలో ఉన్నప్పుడే చంద్రబాబు గుడ్ బై చెప్పి కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ లో కి వెళ్లారు.

ALSO EAD Record break : గత రికార్డు బ్రేక్ చేసిన రేవంత్ సర్కార్..!

ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉంటే తన వ్యాపారాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? అందుకే ఆయన కార్ల బేరానికి వెళ్లారని తెలుస్తుంది. ఒకవేళ మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే వాళ్ల విద్యాసంస్థల వ్యాపారాలు, అక్రమ కట్టడాలు ,ఆక్రమణలు వెలుగులోకి రాకుండా ఉంటాయా ..? అనేది చర్చనీయాంశంగా మారింది.