Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

POLYCET : 27 నుంచి పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్..! 

పాలిటెక్నిక్ కళాశాలలలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్–2026 వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 27వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సి పాల్ డా. ఎం. శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు.

POLYCET : 27 నుంచి పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్..! 

నారాయణపేట, మనసాక్షి :

పాలిటెక్నిక్ కళాశాలలలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిసెట్–2026 వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 27వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సి పాల్ డా. ఎం. శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ కౌన్సెలింగ్ ద్వారా విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు.

ఈ నెల 27 నుండి 31వ వరకు ఆన్‌లైన్ (మీ సేవా) ద్వారా ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. 29 నుండి జూన్ 1వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించబడు తుందని, మే 29 నుండి జూన్ 3వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కొస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజి నీరింగ్, మెకానికల్ ఇంజి నీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీ రింగ్ కోర్సులు అందుబాటు లో ఉన్నాయని తెలిపారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన సాంకేతిక విద్యను అందిస్తూ విద్యార్థులకు ఉపాధి అవ కాశాలు కల్పించే విధంగా కళాశాల పనిచేస్తోందన్నారు.

అలాగే ఈ విద్యాసంవత్సరానికి ప్రత్యేకంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కొస్గిలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాలిసెట్ విద్యార్థులు సర్టిఫి కెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, కౌన్సెలింగ్ ప్రక్రియ కు సంబంధించిన సందేహాల నివృత్తి తదితర సేవలను ఈ హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా పొందవచ్చన్నారు.

కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్,ఎస్ ఎస్ సి మెమో, సమాన అర్హత పరీక్ష మెమో, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు,ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం,4 నుండి 10వ తరగతి వరకు బోనాఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించాలని తెలిపారు.

పాలిసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు టీజీ పాలీసెట్. ఎన్ఐసి. ఇన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకొని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కోస్గి లో ప్రవేశాలు పొందాలని ప్రిన్సి పాల్ డా. ఎం. శ్రీనివాసులు కోరారు.

మరిన్ని వార్తలు