Ponguleti : ఇంకో 60 రోజులంటూ.. పొంగులేటి సంచలన కామెంట్స్..!
ప్రజలకు ఏం కావాలో .... వాళ్లు ఏం కోరుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు... వారి ఆకాంక్షలకనుగుణంగానే హామీలిస్తాం... వాటిని అధికారంలోకి వచ్చాక చేసి చూపుతాం... కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి మాట నిలబెట్టుకున్నాం.... తెలంగాణలోనూ అధికారం వచ్చాక ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి మాట నిలబెట్టుకుంటామని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, ఎన్నికల కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

Ponguleti : ఇంకో 60 రోజులంటూ.. పొంగులేటి సంచలన కామెంట్స్..!
కర్ణాటకలో నిలబెట్టుకున్నాం… తెలంగాణలోనూ నిలబెట్టుకుంటాం.
తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
నేలకొండపల్లి లో ఆ పార్టీ మండల ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం
నేలకొండపల్లి , మన సాక్షి.
ప్రజలకు ఏం కావాలో …. వాళ్లు ఏం కోరుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు… వారి ఆకాంక్షలకనుగుణంగానే హామీలిస్తాం… వాటిని అధికారంలోకి వచ్చాక చేసి చూపుతాం… కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి మాట నిలబెట్టుకున్నాం…. తెలంగాణలోనూ అధికారం వచ్చాక ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి మాట నిలబెట్టుకుంటామని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, ఎన్నికల కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
నేలకొండపల్లి మండలంలోని సీతారామఫంక్షన్ హాల్లో జరిగిన మండల పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత మండల పర్యటనకు విచ్చేసిన పొంగులేటికి బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు.
ALSO READ : MODI : తెలంగాణలో కరప్షన్.. కమిషన్.. కారు స్టీరింగ్ వేరే వాళ్ళ చేతిలో ఉంది..!
అనంతరం జరిగిన సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అనేక హామీలిచ్చామని ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. ఇళ్లు లేని ఎంతోమంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు.
ఇప్పుడు కూడా ఆరు గ్యారంటీలు ఇచ్చామని అధికారమొచ్చాక వాటిని అమలు చేసి చూపుతామని పేర్కొన్నారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని పార్టీలోని ప్రతి నాయకుడికి, కార్యకర్తకు మంచి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు.
ALSO READ : Amazing scheme of Central Govt : కేంద్ర ప్రభుత్వ అద్భుత పథకం.. కోటి రూపాయలు ఇవ్వనున్నారు.. ఇవి నిబంధనలు..!
ఇంకో ఆరవై రోజులు కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువస్తే తమతో పాటు తమను నమ్ముకున్న ప్రతిఒక్కరికి న్యాయం జరుగుతుందని సూచించారు. సోనియమ్మ ప్రకటించిన ఆరుగ్యారంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత ప్రతిఒక్క కార్యకర్తపై ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో పొంగులేటితో పాటు పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి,, నెల్లూరి భద్రయ్య, కొడాలి గోవిందరావు, చెర్వు స్వర్ణ, మామిడి వెంకన్న, చిదుముల జానారెడ్డి ,రాయపూడి నారాయణ రావు, గరిడేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.
Giri, Nelakondapally