Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : పేదల ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..! 

Miryalaguda : పేదల ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..! 

మిర్యాలగూడ, మన సాక్షి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి,  ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో కలిసి మిర్యాలగూడ పట్టణంలోని 6 వ వార్డ్ ఇందిరమ్మ కాలనీ, బాపూజీ నగర్ లోప్రారంభించి లబ్ధి దారులకు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నిరుపేదలకు ఆసరాగా ఉండేందుకు రేషన్ లో ఇస్తున్న దొడ్డు రకం బియ్యాన్ని ప్రజలు తినడానికి అనుగుణంగా లేక బియ్యం తప్పు దారి పట్టించి కొందరు దందాలు చేసి డబ్బులు పోగుచేసుకుంటున్నారు.

ప్రభుత్వ ధనం వృథా అవ్వడమే కాక నిరుపేదలకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉందనే ఉద్దేశంతో.. పేదల ఆకలి తీర్చేందుకు సన్న బియ్యం పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని మరోసారి నిరూపించింది అని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా పాలన ప్రతీ ఒక్కరి సంక్షేమం కోసం సాగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు రుణ మాఫీ, గ్యాస్ సిలిండర్ పై 500 రూపాల సప్సిడి , నిరుద్యోగుల కోసం వేల ఉద్యోగ నియామకాలు, ఇప్పుడు నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పెదలకు అండగా ఉంది అని అన్నారు.

ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలను చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రతి పక్ష నాయకులు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టే విధంగా ప్రతీ ఒక్క నాయకుడు, ప్రతీ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని అన్నారు.

అలాగే రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్క నిరుపేద కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ హరిబాబు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, చిలుకూరి బాలు, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

MOST READ : 

  1. Job Mela : 4న జాబ్ మేళ.. పదవ తరగతి , ఐటిఐ , ఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు..! 

  2. Ration Cards : రేషన్ కార్డు ఉన్నవారికి మరో భారీ గుడ్ న్యూస్.. బిగ్ అప్డేట్..!

  3. Pumpkin seeds : గుమ్మడి గింజలు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.. లేదంటే డేంజరే..!

  4. Nalgonda : పేదల ఆత్మగౌరవ పథకం.. సన్న బియ్యం పంపిణీ.. మంత్రి కోమటిరెడ్డి..!

  5. Traffic : మీ బండ్లకు, కార్లకు ఈ చలాన్లు చెల్లించడం లేదా.. అయితే భారీ షాక్.. కొత్త పెనాల్టీలు..!

మరిన్ని వార్తలు