చంద్రబాబును విడుదల చేయాలని.. ఎంజీఆర్ పోస్ట్ కార్డు ఉద్యమం..!
చంద్రబాబును విడుదల చేయాలని.. ఎంజీఆర్ పోస్ట్ కార్డు ఉద్యమం..!
పాతపట్నం, మన సాక్షి:
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ను వెంటనే విడుదల చేయాలని , పాత పట్టణం నియోజకవర్గం టిడిపి నేత మామిడి గోవిందరావు (ఎంజీఆర్) కోరారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో ఎంజిఆర్ క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుకు మద్దతుగా పోస్ట్ కార్డుల ఉద్యమం చేపట్టారు.
ఆయన మాట్లాడుతూ బాబుకు మద్దతుగా 6000 పోస్ట్ కార్డులు పంపిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పై కక్షసాధింపు చర్యలు లో భాగంగా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం అప్రజాస్వామ్యకుమని విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో అక్రమ కేసులకు తావు లేదని ప్రపంచం మొత్తం చంద్రబాబు నాయుడుకు వెన్నుదన్నుగా నిలవడానికి కారణం ఆయన నిజాయితీ చిత్తశుద్దేనని ఎంజీఆర్ తెలిపారు.
ALSO READ : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఐదుగురు దుర్మరణం..!
ఈకార్యక్రమంలో పాతపట్నం టిడిపి మండల అధ్యక్షులు పైల బాబ్జి, హిరమండలం మండల అధ్యక్షులు యాళ్ల నాగేశ్వరరావు, ఎల్ ఎన్ పేట మాజీ టిడిపి మండల అధ్యక్షులు వెలమల గోవిందరావు, కొత్తూరు మాజీ టిడిపి మండల అధ్యక్షులు ఎద్దు దాస్ నాయుడు, మెలియాపుట్టి మండల నాయకులు నంబాల వెంకటరావు,తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కోలాపు కృష్ణమాచార్య, తెలుగుదేశం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ఆరుబోలు దశరథ రావు,
ఎంజీఆర్ యువసేన అధ్యక్షులు పోతురాజు శ్రీధర్,తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అంపిలి పోలి నాయుడు, గిరిజన ఆదివాసి అధ్యక్షులు బరండి గోపాలరావు, సనపల తిరుపతిరావు, వాలిపల్లి వెంకటరమణ, ముంగెనపాడు ఎక్స్ సర్పంచ్ యార్బాటి రాంబాబు, గోకవలస అశోక్, ఉమా శంకర్, రాజేష్ మహాపాత్రో, ముగడ భద్రయ్య, పిండి రామారావు, పరం దోషం సాయి, ధర్మాన రమేష్, పొన్నాన రామకృష్ణ మాస్టర్,తదితరులు పాల్గొన్నారు.
ALSO READ : మాడ్గులపల్లి : తల్లితండ్రులు మందలించారని.. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య..!









