జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కరపత్రం విడుదల

జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కరపత్రం విడుదల
చౌటుప్పల్ :
ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధనకై ఈనెల 11న యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో నిర్వహించే ఎమ్మార్పీఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బోయ లింగస్వామి మాది ఆధ్వర్యంలో గురువారం కరపత్రములు విడుదల చేశారు.
ALSO READ : Mahesh Babu : మహేష్ బాబు కొత్త సినిమా లో మాస్ లుక్.. వేసుకున్న షర్ట్ ఖరీదు ఎంతో తెలుసా..?
ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉదరి వెంకటేష్ మహాజన్ పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం 29 సంవత్సరాలుగా పోరాడుతున్న ఏకైక చరిత్ర మాదిగలకు మాత్రమే దక్కిందని అన్నారు. ఈనెల 11న జరిగే మహాసభకు ముఖ్యఅతిథిగా మందకృష్ణ మాదిగ పాల్గొంటున్నారని ఈ సభకు మాదిగలు, ఉప కులాలు, వివిధ ప్రజా సంఘాల వారు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ALSO READ : Central Govt : కేంద్రం కీలక నిర్ణయం.. సామాన్యులకు ఊరట..!
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రవణ్ కుమార్ మాదిగ, మున్సిపాలిటీ అధ్యక్షులు ఎర్ర శంకర్ మాదిగ, పంతంగి గ్రామ శాఖ అధ్యక్షులు బోయ శ్రావణ్ కుమార్ మాదిగ, రామలింగం తదితరులు పాల్గొన్నారు.