క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Huzurnagar : రోడ్డు ప్రమాదంలో బలైపోయిన పోస్టాఫీస్ ఉద్యోగి..!

Huzurnagar : రోడ్డు ప్రమాదంలో బలైపోయిన పోస్టాఫీస్ ఉద్యోగి..!

హజూర్‌నగర్, (మనసాక్షి):

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో సోమవారం తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అదుపు తప్పి లారీ కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

స్థానికుల సమాచారం మేరకు, మై హోమ్ సిమెంట్‌కు చెందిన ఓ లారీ, సిమెంట్ లోడుతో కోదాడ వైపు వెళ్తుండగా, అదే సమయంలో హుజూర్ నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన పెద్దవరపు అంజి (26) తన ఇంటికి పల్సర్ బైక్ పై ప్రయాణిస్తున్నాడు. లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించిన సమయంలో, అతని బైక్ అదుపుతప్పి కింద పడింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ అంజిపై నుంచి దూసుకెళ్లింది.

దీంతో అతను సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు పోస్టాఫీస్ ఉద్యోగిగా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా (ఆరు నెలల క్రితం) వివాహమైన అతని మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

MOST READ ; 

  1. BREAKING : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి..!

  2. Huzurnagar : నలుగురు నకిలీ ఎస్సైలు.. వారి టార్గెట్ బంగారం షాపులే.. ఏం చేశారో తెలిస్తే షాక్..!

  3. Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!

  4. District collector : రైతులతో కలిసి తిరిగిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలిస్తే షాక్..!

  5. Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!

మరిన్ని వార్తలు