Power cut : రేపు విద్యుత్ సరఫరా అంతరాయం, ఎక్కడో తెలుసుకుందాం..!

రేపు విద్యుత్ సరఫరా అంతరాయం, ఎక్కడో తెలుసుకుందాం..!
మల్కాజిగిరి, మనసాక్షి
ఆనంద్ బాగ్ సబ్ స్టేషన్ పరిధిలోని చంద్రగిరి కాలనీ, శారదా నగర్, ఓల్డ్ సఫిల్ గుడ ఫీడర్ మరమతుల కారణంగా బుధవారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాను మూడు గంటలపాటు అంతరాయం ఏర్పడుతుందని ఎడిఈ యాదగిరి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
స్థానిక ప్రజలు దీన్ దయాల్ నగర్, దినకర్ నగర్, ఓల్డ్ సఫిల్ గూడ, వివి గార్డెన్, సుధా నగర్, జైన్ మందిర్, శివ గౌరీ ఎంక్లేవ్, చంద్రగిరి కాలనీ, గంగపుత్ర సంఘం, వినాయక నగర్ బ్లాక్ 3,4,5,6 నవ భారతి హై స్కూల్, డి ఏ వి పబ్లిక్ స్కూల్, డి మార్ట్ బ్యాక్ సైడ్ తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను మూడు గంటలు నిలిపివేస్తున్నామని వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని వారు కోరారు.