AP : ప్రజాగళం సభ సూపర్ సక్సెస్..!

రాష్ట్రాన్ని అన్ని విధాల అప్పులపాలు చే చేయడంతో పాటు అరాచక పాలన సాగిస్తున్న జగన్ ను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు.

AP : ప్రజాగళం సభ సూపర్ సక్సెస్..!

టిడిపి అధికారంలోకి రాగానే మదనపల్లి జిల్లా

మదనపల్లిలో ఉత్సాహంగా ప్రసంగించిన చంద్రబాబు

మదనపల్లి, మన సాక్షి :
రాష్ట్రాన్ని అన్ని విధాల అప్పులపాలు చే చేయడంతో పాటు అరాచక పాలన సాగిస్తున్న జగన్ ను ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి మదనపల్లిలో టిడిపి అభ్యర్థి షాజహాన్ భాషా ఆధ్వర్యంలో ప్రజా గళం సభ పెద్ద ఎత్తున జరిగింది. విశేష సంఖ్యలో జనం హాజరయ్యారు. సభ సూపర్ సక్సెస్ అయ్యింది. చంద్రబాబు ప్రసంగానికి జనం నుండి అనూహ్య స్పందన లభించింది.

 

ఈ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈప్రభుత్వంపైన వ్యతిరేకతను ఓటురూపంలో చూపించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బటన్ నొక్కే ముఖ్యమంత్రి బటన్ నొక్కిన తర్వాత ఎంత బొక్కాడో చెప్పాలని అన్నారు. కరెంట్ బిల్లులు అమాంతం పెంచి పేదల రక్తాన్ని పీల్చే జలగను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పెరిగిన కరెంట్, ఇంటిపన్నులు, పెట్రోల్, డీజిల్, రిజిస్ట్రేషన్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు మనసులో పెట్టుకుని ఓటు వెయ్యాలని కోరారు. నిరుద్యోగం పెరిగిపోయిందని జాబ్ క్యాలెండర్ ఇస్తానని యువతను నట్టేట ముంచారని, మొదటి ఓటు వేసేవారు మీ జీవితాలను బాగుపరచుకోవాలంటే తెదేపాకు ఓటు వెయ్యాలని అన్నారు.

 

మధ్యానికి అలవాటు పడినవారు పగలంతా కష్టపడి రాత్రి అయితే సంపాదించిన డబ్బులు పెరిగిన మధ్యం ధరలకు పెట్టి ఇంటికి ఏమీ తీసుకెళ్లలేక నరకయాతన పడుతున్నారని తెలిపారు. ఓట్లకోసం అందరికీ మధ్యం తాగిస్తారని ఆ మత్తులో ప్రజలు ఉంటే ఓట్లు వాళ్లే వేసుకుంటారని అన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే నాణ్యమైన మధ్యం అందుబాటులో ఉంటుందన్నారు. వైకాపా ప్రభుత్వంలో జీతాలు రాని పరిస్థితి ఉందని దాన్ని తెదేపా అధిగమించి అందరికీ సరైన సమయంలో జీతాలు అందజేస్తామని అన్నారు. రాష్ట్రం గంజాయి మత్తులో ఊగుతోందని మదనపల్లెలో కూడా గంజాయిని యువతకు అలవాటు చేశారని అన్నారు.

ALSO READ : KTR : పార్లమెంటు ఎన్నికల తర్వాత బిజెపిలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..! (వీడియో)

మదనపల్లె ప్రజలకు తాగునీరు సాగునీరు అందించే దిశగా తాను ఎంతో కృషి చేస్తే ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క టీయంసీ నీరు కూడా ఇచ్చిన దాఖాలాలు లేవన్నారు. కియా మోటార్స్ తీసుకువచ్చి ఉద్యోగ కల్పన చేస్తే ఉన్న పరిశ్రమలని పారద్రోలిన గణత జగన్మోహన్ రెడ్డిది అన్నారు. రాయలసీమకు తాగునీరు సాగునీరు కావాలంటే జగన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి తెదేపాను గెలిపించాలని కోరారు. మైనార్టీలకు తెదేపా చేసిన సంక్షేమంపై చర్చకు సిద్దమని వైకాపా వారికి సవాలు విసిరారు. దుకాన్ ఔర్ మఖాన్, దుల్హన్ పధకం, విదేశీ విధ్య, రంజాన్ తోఫా, ఇనామ్ మౌజాంలకు న్యాయం చేసిన పార్టీ తెదేపా అన్నారు. ఉర్దూ యూనివర్సిటీలు, షాదీ ఖానాలు కట్టించానని తెలిపారు. మైనార్టీలు అందరూ జనసేన, బీజేపి పొత్తుతో ఎవరికీ నష్టం కలగనివ్వనని హామీ ఇచ్చారు.

 

ఆరు నెలలుగా ఇమామ్, మౌజమ్ లకి జీతం లేదని విదేశీ విధ్యని తీసేసిన వాడికి ఓటు వెయ్యకండి అని అన్నారు. గతంలో చేసిన అభివృద్దికంటే ఈసారి మదనపల్లెలో షాజహాన్ బాషాను గెలిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ది చేసి చూపిస్తా అన్నారు. జగన్ సిద్దం అంటున్నారు … దేనికి సిద్దం.. ఓడిపోవడానికి వైకాపా సిద్దం అన్నారు. స్వచ్చందంగా మనుషులు రారని మద్యం డబ్బులు పంచినా వారి సభలకు జనాలు రాలేదని అన్నారు. సొంత చెల్లిని గౌరవించలేని వాడికి రాష్ట్రంలోని ఆడపడుచులను ఎంత మాత్రం గౌరవిస్తాడో ఆలోచించాలని అన్నారు. సంపద సృష్టంచే పార్టీ ఎన్డీఏ అన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూనే సంపద సృష్టస్తామని అన్నారు.

ALSO READ : Miryalaguda : ప్రయోజనం లేని పనులకు ప్రజాధనం దుర్వినియోగం..!

మహాలక్ష్మి పధకం కింద ఒక్కో ఆడబిడ్డకు నెలకు 1500
తల్లికి వందనం పేరుతో సంవత్సరానికి 15000
దీపం పధకం కింద మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు
ఆడవాళ్లు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచిత ఆర్టీసీ ప్రయాణం
అన్నదాతకు సంవత్సరాని 20000 వేలు ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా అన్నారు. యువగళం పేరుమీద 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. తెదేపా రాగానే విద్యత్ బారం తగ్గిస్తామని, అన్నా క్యాంటీన్ లు తెరచి పేదవాడికి అన్నం పెడతామని, నాణ్యమైన మద్యం ఇస్తామన్నారు.

 

బీసీ ఎస్సీ ఎస్టీలకు అందరికీ అండగా ఉంటామని అన్నారు. పాపాల పెద్దిరెడ్డి అన్నం తినడం మానేసి ఉదయం అల్పాహారం కింద ఇసుక మద్యాహ్న బోజనం కింద మైనింగ్ రాత్రి బోజనానిని ఇరిగేషన్ ప్రాజెక్టులు తినేస్తున్నాడన్నారు. పుంగనూరుకు తండ్రి తంబళ్ల పల్లికి చిన్నాన్న , రాజంపేటకు కొడుకు ఉండటానికి మీకేమైనా అన్నమయ్య జిల్లాను రాసి ఇచ్చేశారా అన్నారు. పెద్దిరెడ్డి కుటుంబ పెత్తనాన్ని తరిమికొట్టాలన్నారు. ఇక్కడ నాయకులు లేరనా పరాయి పెత్తనం అని ప్రశ్నించారు. వీరి అరాచకం, దౌర్జన్యాలు మితిమీరి పోయాయన్నారు. ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు కూడా జరగకుండా ప్రత్యర్థుల నామినేషన్లను స్కూటీనిలో ఎగ్గొట్టారన్నారు. టిడిపి పాలనలో ఇలా ఎన్నడైనా జరిగిందా అని ప్రశ్నించారు. ఇసుక దోపిడి, భూకబ్జాలు, సహజ వనరుల దోపిడీకి పెద్దిరెడ్డి కుటుంబికులు పక్క నియోజకవర్గాలపై పడుతున్నరన్నారు.

ALSO READ : KTR : యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ హెచ్చరిక.. పరువు నష్టంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం..!

హంద్రీనీవా డబ్బులను పక్కదారి పట్టిస్తున్నారని తానొస్తే అక్రమ కేసులు పెట్టించారన్నారు. ప్రజలు రౌడీ ఇజాన్ని తరిమికొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. మదనపల్లెను జిల్లా కేంద్రం చేసే భాద్యత తనదే అని స్పష్టం చేశారు. దోపిడీకి మదనపల్లెను ఎంచుకుని అభివృద్దిని విస్మరించిన గణత వైకాపా నాయకులదని అన్నారు. దేవాలయ భూములను, వక్ఫ్ ఆస్తులను కాపాడుతామని అన్నారు. మూడు పార్టీల జెండాలు వేరైనా అందరి అజెండా వైకాపాని తరిమికొట్టడం ఒక్కటే అన్నారు.