Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

KTR : పార్లమెంటు ఎన్నికల తర్వాత బిజెపిలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..! (వీడియో)

KTR : పార్లమెంటు ఎన్నికల తర్వాత బిజెపిలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..! (వీడియో)

హైదరాబాద్ , మన సాక్షి :

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఖతమవుతుందని కనీసం 40 సీట్లు కూడా రావని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై, రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

 

దేశంలో రాహుల్ గాంధీ నరేంద్ర మోడీని, ఆదాని ని విమర్శిస్తుంటే తెలంగాణకు వచ్చిన మోడీని రేవంత్ రెడ్డి మాత్రం బడే బాయ్ అంటున్నాడని ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తన గుంపు తీసుకొని బిజెపిలో చేరే మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. తాను విమర్శించే ప్రతిదానికి రేవంత్ రెడ్డి స్పందిస్తాడని కానీ బిజెపిలోకి వెళ్తాడని ఇప్పటికి పది సార్లు చెప్పినప్పటికీ కూడా దానిపై స్పందించడం లేదన్నారు. జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పడం లేదని కేటీఆర్ విమర్శించారు.

 

ALSO  READ : KTR : యూట్యూబ్ ఛానళ్లకు కేటీఆర్ హెచ్చరిక.. పరువు నష్టంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం..!

 

 

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు