Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

BREAKING : మండల స్థాయిలోనే ప్రజా సమస్యలు పరిష్కరించాలి.. అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం..!

BREAKING : మండల స్థాయిలోనే ప్రజా సమస్యలు పరిష్కరించాలి.. అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం..!

సూర్యాపేట, మనసాక్షి:

ప్రభుత్వ అధికారులు తమ వద్దకు వచ్చే ప్రజల సమస్యలను తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం నాడు జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పధకాలు ప్రజలకు చేరవేసే భాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై వుందని అన్నారు.

అధికారులు మండల స్ధాయిలోనే ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తే వారు జిల్లా కేంద్రానికి రావలసిన అవసరం వుండదని అన్నారు. గత ఐదు సంవత్సరాల నుండి జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు తమ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని, వారికి పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రతి జెడ్పిటిసి కూడ తమ మండలంలోని ప్రజా సమస్యలను నిరంతరం అధికారుల దృష్టి కి తీసుకుని వచ్చి ప్రజల కోసం పనిచేశారని అన్నారు. ప్రతి వ్యక్తి తన జీవితంలో 25 సంవత్సరాల వరకు సామాజిక ద్ర్రక్పధం అలవర్చుకుని, తరువాత తన జీవితంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారని, ప్రజా ప్రతినిధిగా గెలిచిన వారు ప్రజా క్షేత్రం లో పనులు చేస్తూ, తమ ప్రాంత అభివృద్ధి కి పనిచేస్తారని అన్నారు.

ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసిమెలిసి పనిచేసి, ప్రజలకు తమ వంతు సేవలు అందించడానికి నిరంతరం అందుబాటులో వుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, సిఇవొ అప్పారావు, జెడ్పిటిసిలు, ఎంపిపిలు, అధికారులు పాల్గొన్నారు.

ALSO READ : 

Indiramma Gruhalu : ఇందిరమ్మ గృహాలకు ప్రభుత్వ మార్గదర్శకాలు సిద్ధం.. తాజా అప్డేట్స్..!

BREAKING : కార్యాలయాల్లో బుధ, గురువారాలు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

మరిన్ని వార్తలు