ములుగు : సాయంత్రం 3 గంటల నుంచి తెల్లవారే వరకు అక్కడ వర్షమే
సాయంత్రం 3 గంటల నుంచి తెల్లవారే వరకు అక్కడ వర్షమే
అకాల వర్షానికి తల్లడిల్లుతున్న మిర్చి రైతులు
వెంకటాపురం, మన సాక్షి.
అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాలకు మిర్చి పంటకు నష్టం వాటిల్లింది . ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో శనివారం సాయంకాలం 3 గంటల సమయంలో ప్రారంభమైన అకాల వర్షం ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురవడంవల్ల మిర్చి కళ్లాలు వాగులను తలపి స్తున్నాయి. రైతులు జేసిబి సాయంతో కళ్లాల్లో నిలిసి ఉన్న నీటిని కాలువలు పెట్టి బైటికి మళ్లీస్తున్నారు.
అన్నదాతలకు గడచిన రెండు సీజన్ల నుండి పంట దిగుబడి లేక తెగుళ్లతో సతమతమైన మిర్చి రైతులు ఈఏడాది బాగుంది బహిరంగ మార్కెట్లో చక్కటి ధర పలుకుతున్న సమయంలో అకాల వర్షాలకు పంట నీటిపాలై పోయింది. కళ్లాల్లోఆరబెట్టిన మిర్చి నీళ్లపాలై తేలియాడుతుండటంతో అన్నదాతల గుండెలు బరువెక్కాయి. ప్రభుత్వం సత్వరమే పంట నష్టపరిహార చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.









