భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

బారికేడ్లను ఏర్పాటు చేసిన ఎస్సై ప్రభాకర్

భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

బారికేడ్లను ఏర్పాటు చేసిన ఎస్సై ప్రభాకర్

రుద్రంగి,  (మనసాక్షి)

మూడు రోజులుగా రుద్రంగి మండలం లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తుండడంతో స్థానిక ఎస్సై ప్రభాకర్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు తెలిపారు. భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు చెరువులు నీటి ప్రవాహంతో పొంగిపొర్లుతున్నాయి అని అన్నారు.

 

మంగళవారం మానాల గ్రామంలో తాతమ్మ బ్రిజ్జి మిదిపై ఉధృతం గా ప్రవహించడంతో వాహనదారులకు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక ఎస్సై ప్రభాకర్, పోలీసు సిబ్బంది తాతమ్మ ఒర్రె వద్ద బారికేడ్లలను ఏర్పాట్లు చేసి జాగ్రత్తలు చేపట్టారు.

 

ALFO READ : Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?

 

ఎస్సై మాట్లడుతూ.. రైతులు వర్షం పడుతున్నప్పుడు పంట పొలాల్లో ఉండే కరెంట్ మోటర్లు దగ్గరకు వెళ్లకుండా ఉండాలని, మీ వీధులలో ముద్దు స్తంభాలకు దూరంగా ఉండాలని, స్కూల్ కి సెలవులు ఉన్నందున చిన్నపిల్లలు చెరువులు,కుంటల దగ్గర కి వెళ్లకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పాత ఇంటి గోడల వద్ద ప్రజలు ఉండకూడదని అన్నారు. భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని కోరారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని అన్నారు.

 

నీటి ప్రవాహాల వద్దకు ప్రజలు వెళ్లకూడదని పాత ఇండ్లు. ఏదైనా నష్టం జరుగుతే తెలుపలని అన్నారు. రుద్రంగి,భీంగల్ వైపు వెళ్లే ప్రయాణికులు తండా నుంచి వెళ్లే రింగ్ రోడ్డు మార్గాన వెళ్లాలని తెలిపారు.

 

సహాయక కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య, మండల అధ్యక్షుడు దేగవత్ తిరుపతి,గ్రామ కమిటీ ఛైర్మన్ రవీందర్ రెడ్డి,బాధనవేని రాజారాం,జక్కు మోహన్,నాయిని రాజేశం, అధికారులు తదితరులు పాల్గొన్నారు.