తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Nalgonda : రంజాన్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి..!

Nalgonda : రంజాన్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి..!

నల్లగొండ, మన సాక్షి.

రంజాన్ మాస వేడుకలను ప్రశాంత వాతావరణంలో గడుపుకోవాలని నల్గొండ డిఎస్పి కే. శివరామ్రెడ్డి కోరారు. ఎస్పీ శరత్చంద్ర పవర్ ఆదేశాల మేరకు శుక్రవారం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో శాంతి సంగం సమావేశం ఏర్పాటుచేశారు.

ఈ సమావేశంలో నల్గొండ డి. ఎస్. పి శివరాం రెడ్డి మాట్లాడుతూ, ముస్లింలు అందరూ రంజాన్ మాస ఉపవాస దీక్షలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, ఏమైనా సమావేశాలు కానీ, సామూహిక ప్రార్ధనలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ముందుగా పోలీస్ వారికి తెలియజేయాలని, తద్వారా పోలీస్ వారు బందోబస్తు ఏర్పాట్లు చేసుకుంటారని, ప్రార్ధనల సమయంలో వాహనాలను రోడ్ల పై నిలిపి ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా చూడాలని ముస్లిం సోదరులకి తెలియజేశారు.

ఇట్టి సమావేశంలో కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ పోలీస్ వారికి ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందని, పోలీస్ వారి సూచనలను తప్పకుండా పాటిస్తామని తెలియజేశారు. అనంతరం నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజాశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రంజాన్ మాసం ముస్లిం సోదరులకి ఎంతో పవిత్రమైనది అని దానిని ప్రశాంతమైన వాతావరణం లో జరుపుకోవాలని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలని తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న వారికి సి. సి కెమరాల ప్రాముఖ్యత, నేరస్తులని గుర్తించటం లో వాటి యొక్క ప్రాధాన్యత గురించి చెపుతూ ప్రతి ఒక్కరూ తప్పకుండా సి. సి కేమరా లు అమర్చుకోవాలని, కాలనిలోని కూడళ్లలో కచ్చితంగా సి. సి కెమరా ఉండాలని, వాటి ప్రాధాన్యత కాలనీ ప్రజలకి అర్దమయ్యేలా చెప్పాలని తెలియజేశారు.

సమావేశంలో నల్గొండ డి.ఎస్.పి కె శివరాం రెడ్డి , నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజు , ఎస్. ఐ లు శంకర్, సందీప్ రెడ్డి, సైదులు, ముస్లిం మత పెద్దలు, శాంతి కమిటీ సభ్యులు, నల్గొండ పట్టణ మాజీ కౌన్సిలర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!

  3. Ration Cards : మార్చి 1న వారికే స్మార్ట్ రేషన్ కార్డులు.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

  5. Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు