మిర్యాలగూడ : నగర రమేష్ నాయక్ డాక్టరేట్ ప్రధానం

మిర్యాలగూడ : నగర రమేష్ నాయక్ డాక్టరేట్ ప్రధానం

మిర్యాలగూడ, మన సాక్షి
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం పరిధిలో వస్త్రం తండాకు చెందిన నగర మంగ్లా నాయక్, గోరి దంపతుల కుమారుడు నగర రమేష్ కు నీతి అయోగ్ ఆధ్వర్యంలో సమాజ సేవ కేటగిరీలో ఆసియా వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.

 

అనంతరం నగర రమేష్ మాట్లాడుతూ నా కనుల ముందు జరిగే ప్రతి సమస్యపై నా వంతు ప్రయత్నం గా పరిష్కారానికి కృషి చేస్తానని సమాజం పట్ల బాధ్యత గల పౌరుడిగా జీవిస్తున్నా అదే ఈరోజు నాకు డాక్టరేట్ అందుకునేందుకు కారణమైందని వివరించారు.

 

నేను చేసిన సేవను గుర్తించి నాకు గౌరవ డాక్టరేట్ అందజేసిన యూనివర్సిటీ వారికి కృతజ్ఞతలు తెలిపిన రమేష్. వస్త్రం అనే అతి చిన్న తండాలో జన్మించిన రమేష్ ఎన్నో కష్టాలను అధిగమించి ఈ రోజు ఉన్నత స్థాయి వరకు రావడం అభినందించే విషయమని బాబాయ్ నగర గోపాల్ అన్నారు.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు .. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి 👇

 

అంతే కాకుండా తన సొంత కాళ్లపై నిలబడి హైదరాబాద్ నగరంలో ఆర్ ఎన్ ఆర్ సివిల్ సర్వేర్ అనే కంపెనీని స్థాపించి పదుల సంఖ్యలో యువకులకు వసతి తో పాటు భోజన సదుపాయం కూడా ఏర్పాటుచేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ తనకంటూ ప్రత్యేకత కనపరుస్తున్నారని స్నేహితులు బషీర్, కుంట్ల శ్రీను, గోపాల్, హరిప్రసాద్, సుమన్ రెడ్డి అన్నారు.