రేషన్ కార్డు లేకున్నా ప్రజా పాలన దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎమ్మెల్యే బత్తుల వెల్లడి..!

రేషన్ కార్డు లేని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవచ్చని మిర్యాలగూడ శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి (బి ఎల్ ఆర్) వెల్లడించారు.

రేషన్ కార్డు లేకున్నా ప్రజా పాలన దరఖాస్తు చేసుకోవచ్చు.. ఎమ్మెల్యే బత్తుల వెల్లడి..!

మిర్యాలగూడ , మనసాక్షి :

రేషన్ కార్డు లేని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవచ్చని మిర్యాలగూడ శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి (బి ఎల్ ఆర్) వెల్లడించారు. మంగళవారం మిర్యాలగూడ మండలం యాద్గర్ పల్లిలో ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వ గ్యారంటీ పథకాలకు దరఖాస్తులను స్వీకరించారు.

అనంతరం ఆయన ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రజా పాలన కార్యక్రమం జనవరి 6 వ తారీఖు వరకు కొనసాగుతుందని, అర్హులైన ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ALSO READ : Upi Rules : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు అలర్ట్.. కొత్త సంవత్సరం నుంచి మారిన రూల్స్ .. చూడండి..!

గత 10 సవత్సారాలుగా బీ ఆర్ ఎస్ ప్రభుత్వం లో కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం మరో నెల రోజుల్లోనే కొత్త రేషన్ కార్డు ల కోసం అప్లికేషన్స్ తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జ్యోతిలక్ష్మి , ఏడి వెంకట్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు గాయం ఉపేందర్ రెడ్డి, మహబూబ్అలీ, జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి, స్కైలాబ్ నాయక్, సిపిఐ నాయకులు బంటు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Telangana : మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంలో కీలక మార్పులు.. 2024 జనవరి 1 నుంచి ఆ స్కీమ్స్ ఉపసంహరణ..!