కాందీశీకుల భూమిని నిరుపేదలకు పంపిణీ చేయాలి: ఆకుల ఇంద్రసేనారెడ్డి

కాందీశీకుల భూమిని నిరుపేదలకు పంపిణీ చేయాలి: ఆకుల ఇంద్రసేనారెడ్డి

చౌటుప్పల్.మన సాక్షి:

చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం, తూప్రాన్ పేట గ్రామాల రెవిన్యూ పరిధి జాతీయ రహదారి 9 హెచ్ 65 పక్కన గల కాందీశికుల ఏ 401 గల ఎకరాల భూమిని అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మండలంలోని భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయాలని, భవిష్యత్తు అవసరాలకు భూమిని కేటాయించాలని చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్ ఆర్డీవోకు గురువారం వినతి పత్రం సమర్పించారు.

 

ఈ సందర్భంగా ఆకుల ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వారికి ఆనాడు కేంద్ర ప్రభుత్వం కాందిశీకులకు 1952 లో మహారాష్ట్రలో నివాసముంటున్న రాధా బాయి, తహిల్మాన్ కు సర్వేనెంబర్ 114, 115, 123, 137, 141, 267, 401 ఏ లో గల భూమిని కేంద్ర ప్రభుత్వం ఆలీఖాన్ భూములను వీరి కుటుంబాలకు 1975లో పట్టాదారులుగా కేటాయించారని అన్నారు.

 

ALSO READ : 

  1. TS TET NOTIFICATION : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..!
  2. Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?
  3. Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!
  4. TSRTC : ప్రయాణికులకు ఆర్టీసీ మరో శుభవార్త .. రూ. 50కే రోజంతా ప్రయాణం..!

 

ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సుర్వి నరసింహా గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు బోయ దేవేందర్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీహరి, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మల్కాపురం నరసింహ, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాధగోని శేఖర్ గౌడ్, మునుగోడు నియోజకవర్గ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు రాచకొండ భార్గవ్ బ్లాక్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొమ్మ మైసయ్య, జిల్లా ఓబీసీ సెల్ కోఆర్డినేటర్ కుర్నాల వెంకటేశం, మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు నల్లంకి వెంకటేశం గౌడ్, చిలువేరు సాయి, ఎర్ర శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు తగరం నాగరాజు, ఉప్పర గోని అంజయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.