శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ హుండీ .. ఆదాయం ఎంతో తెలుసా..?
శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ హుండీ .. ఆదాయం ఎంతో తెలుసా..?
కనగల్, మన సాక్షి
భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దర్వేశిపురం (పర్వతగిరి) శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయ హుండీని బుధవారం ఎండోమెంట్ అధికారులు లెక్కించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు హుండీలో వేసిన డబ్బులను ఆలయ ప్రాకార మండపంలో లెక్కించారు.
85 రోజులకు గాను రూ. 11 లక్షల, 92 వేల, 514 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో జల్లేపల్లి జయరామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి, ఆలయ మాజీ చైర్మన్లు నల్లబోతు యాదగిరి, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, సర్పంచ్ అంజమ్మ రామచంద్రు, నాయకులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, యాదగిరి,
ఉప సర్పంచ్ జినుకుంట్ల అంజయ్య, ఆలయ ప్రధాన అర్చకుడు మల్లాచారి, ఆలయ సీనియర్ అసిస్టెంట్లు జినుకుంట్ల చంద్రయ్య, చిలుకరాజు లింగయ్య, జూనియర్ అసిస్టెంట్లు కూసం ఉపేందర్ రెడ్డి, చెనగాని లింగస్వామి, ఆంజనేయులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.









