రేవంత్ రెడ్డిని కలిసిన అమరేందర్ రెడ్డి, పాదయాత్ర కు గ్రీన్ సిగ్నల్ ..?

రేవంత్ రెడ్డిని కలిసిన అమరేందర్ రెడ్డి, పాదయాత్ర కు గ్రీన్ సిగ్నల్ ..?

మిర్యాలగూడ, మన సాక్షి : టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి శుక్రవారం హైదరాబాదులో ఆయన నివాసంలో కలిశారు. నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇంటింటికి వెళ్లి కలవడంలో పాటు ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది.

కాగా ఈ మేరకు రేవంత్ రెడ్డిని అమరేందర్ రెడ్డి కలవడంతో ప్రాధాన్యత అంతరించుకుంది. అమరేందర్ రెడ్డి చేపట్టే పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా..? లేదా..? అనేది వేచి చూడాల్సి ఉంది. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుందూరు రఘువీర్ రెడ్డి ఉన్నారు.