రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ – రాజగోపాల్ రెడ్డి ఫైర్ – LATEST NEWS

రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్ – రాజగోపాల్ రెడ్డి ఫైర్

హైదరాబాద్, మనసాక్షి : టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బుధవారం హైదరాబాదులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ది బ్లాక్ మెయిల్ చరిత్రని పేర్కొన్నారు. ఎంతోమందిని బెదిరించారని పేర్కొన్నారు. పిసిసి పదవిని కూడా డబ్బులతో కొన్నాడని దుయ్యబట్టారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి తనపై నిందలు వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ : మద్యానికి బానిసై ఎవ్వరూ లేని ఇళ్లు టార్గెట్ – latest news

ఆత్మ గౌరవం చంపుకొని రేవంత్ రెడ్డి కింద పని చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. ఏ వ్యాపారం చేయకుండానే రేవంత్ రెడ్డికి వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సోనియాగాంధీని కించపరిచేలా తాను ఎప్పుడు మాట్లాడలేదని, సోనియాను బలిదేవత అన్నది రేవంత్ రెడ్డి ఒక్కడేనని చెప్పారు. బిజెపితో కాంట్రాక్టు తీసుకున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని తెలిపారు.

ALSO READ : దేశమంతా నాగుల పంచమి.. కందుకూరు లో తేళ్ళ పంచమి

ఓటుకు నోటు కేసులో డబ్బులతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని , సోనియా, వైఎస్ఆర్ ను తిట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎన్నడు పాల్గొనలేదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.