Telangana | అమరవీరుల స్తూపం నిర్మాణంలోనూ.. అవినీతి..! – రేవంత్ రెడ్డి

Telangana | అమరవీరుల స్తూపం నిర్మాణంలోనూ.. అవినీతి..! – రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మనసాక్షి :
తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మాణానికి 2018లో 63 కోట్ల రూపాయల అంచనా వేశారని అన్నారు.
కాగా దానిని మరో మూడు దఫాలుగా అంచనా వ్యయాన్ని పెంచుతూ రూ. 179.05 కోట్లకు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. అమరవీరుల స్తూపం నిర్మాణం కోసం ఒకే కంపెనీ మూడు కంపెనీల పేర్లతో డమ్మీగా టెండర్లు వేశారని ఆయన ఆరోపించారు.
♦️ ఎక్కువమంది చదివిన వార్తలు .. మీరు కూడా చదవడానికి క్లిక్ చేయండి 👇
🔥 Rythu Bandhu : రైతు బంధు కోసం దరఖాస్తులు చేసుకోవాలి..!
🔥 Central scheme | ఈ పథకంలో చేరితే.. రైతులకు నెలకు రూ. 3 వేలు..!
🔥 Latest Jobs : ఏదైనా డిగ్రీ ఉంటే.. ఉద్యోగ అవకాశాలు, భారీ ప్యాకేజీ..!
🔥 PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు, కస్టమర్లకు రూ. 2 లక్షల ఆదా…!
అమరవీరుల స్తూపం వద్ద కనీసం అమరవీరుల పేర్లు కూడా రాయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల వివరాలు ఉంటే బాగుంటది అని ఆయన అన్నారు. అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల పేర్లు రాయకుండా ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఎందుకు పెట్టారు అని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమంలో 1569 మంది అమరులయ్యారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలను కేసీఆర్ తన స్వార్థానికి వాడుకుంటున్నారని అన్నారు.