సూర్యాపేట: ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

యూత్ కాంగ్రెస్ నాయకులు ఫరూక్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్

సూర్యాపేట, మనసాక్షి : రానున్న రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టేలా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఎండి షఫీ ఉల్లా అన్నారు. మంగళవారం టి పి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎస్.కె ఫరూక్ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ వద్ద కేకును కట్ చేసి బాణాసంచా కాల్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికార పార్టీ గుండెల్లో నిద్రించే రేవంత్ రెడ్డి ఆ భగవంతుని ఆశీస్సులతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో ముగిసిందని ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర మిగిలిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పతనం ప్రారంభమైందని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేసే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముదిరెడ్డి రమణా రెడ్డి , గట్టు శ్రీనివాస్ , గోదల రంగారెడ్డి, స్వామి నాయుడు, బంటు చొక్కయ్య గౌడ్,పాలగాని కృష్ణమ్మ నాయుడు, ధర్మ ,చారి, తదితరులు పాల్గొన్నారు.