రైతులను దగా చేస్తున్న మిల్లర్లు – బి ఎల్ ఆర్

రైతులను దగా చేస్తున్న మిల్లర్లు – బి ఎల్ ఆర్

తేమ శాతం, తాలు పేరుతో ధరల తగ్గింపు

మిర్యాలగూడ, మన సాక్షి : తేమ శాతం , తాలు ఎక్కువగా ఉందని రైస్ మిల్లర్లు రైతులను దాదా చేస్తున్నారని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ భత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) అన్నారు. సోమవారం మిర్యాలగూడలో రైస్ మిల్లులను సందర్శించి రైతులు, రైస్ మిల్లర్లతో మాట్లాడారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మిర్యాలగూడ పరిసర ప్రాంత రైతులు సన్నరకం దాన్యాన్ని పండించి ప్రభుత్వ వైఫల్యం, అధికార పార్టీ నాయకుల వలన ఇక్కడ రైతులు అన్యాయమైపోతున్నారని అన్నారు. గత వారం రోజుల క్రితం వరి కోతలు ప్రారంభం కాగా క్వింటా దాన్యం ధర 2350 రూపాయల వరకు చెల్లించి, ఇప్పుడు 1900 రూపాయలు కూడా చెల్లించడం లేదన్నారు. పెట్టకుండా తేమశాతం, అధికార పార్టీ నాయకులు ఆంధ్ర ప్రాంతంలో వారికున్న బంధుత్వము మరియు పరిచయాలతో రాజకీయ అండతో ఆంధ్ర ప్రాంతం నుండి వందల లారీలు సన్నరకం దాన్యం దిగుమతి చేస్తూ ఇక్కడ పండించిన సన్న రకం ధాన్యానికి తక్కువ ధర చెల్లిస్తున్నారని ఆరోపించారు.

మిర్యాలగూడ ప్రాంతంలో ఆసియా ఖండంలోనే అత్యధిక రైస్ మిల్లులు ఉన్న ప్రాంతంగా ఉండి ఇక్కడి ప్రజలు మిల్లుల నుండి వచ్చే దుమ్ము, ధూళి, వాసన, కలుషిత నీరు అనుభవిస్తూ .. ఉంటే అధికార పార్టీ నాయకులు ప్రజల ఆరోగ్యం తోటి పట్టింపు లేక ఇక్కడి ప్రజలకు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇప్పించడంలేదన్నారు. ఆంధ్ర ప్రాంతం నుండి ధాన్యాన్ని కొనుగోలుకు చేసే విధంగా వారికి అండదండలుగా ఉండకుండా ఆంధ్ర ప్రాంతాన్ని కట్టడి చేసి మిర్యాలగూడ పరిసర ప్రాంత రైతులకు క్వింటాకు ధర 2300 రూపాయలు కల్పించని లేనియెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యాచరణ చేపడతారని తెలియజేసినారు.