రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మఠంపల్లి, మన సాక్షి: మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో రోడ్డు ప్రమాదంలో ఎన్సీఎల్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పని చేస్తున్న నంద్యాల విష్ణు కుమార్ రెడ్డి వయసు 28 సంవత్సరాలు, సొంత గ్రామం తాండూరు, వైఎస్ఆర్ కడప జిల్లా . మఠంపల్లి వైపు నుండి ఎన్సీఎల్ ఫ్యాక్టరీ కి వేళ్ళే మార్గ మధ్యలో సుల్తాన్ పురం తండా దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడం వలన విష్ణు కుమార్ రెడ్డి తలకు బలమైన గాయమై మరణించారు.

పోస్ట్ మార్టం నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మఠంపల్లి ఎస్సై ఇరుగు రవి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే లారీ డ్రైవర్ సంఘటన జరిగిన తర్వాత లారీని వదిలి పారిపోయినట్లు తెలిపారు.