Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..!

BREAKING : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..!

చింతపల్లి.  మన సాక్షి:

దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని నేరడు గోమ్ము మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన యువకుడు గండికోట శ్రీహరి 25 సంవత్సరాలు రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికి అక్కడికి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం నేరడుగోమ్ము మండల కేంద్రం నుండి తన సొంత గ్రామమైన కొత్తపల్లి గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో మోటార్ బైకు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే శ్రీహరి మృతి చెందాడు.

ALSO READ : Software : ఈ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం గ్యారెంటీ.. అవేంటో తెలుసుకుందాం..!

సమాచారం తెలుసుకున్న నేరేడు గోమ్ము మండల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. ప్రమాదానికి గురైన మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి నేరేడు గోమ్ము పోలీసులు తరలించారు.

చేతికి అందిన కొడుకు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో మృతుని తల్లిదండ్రుల రోదనలను ఎవరు ఆపలేకపోయారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే శ్రీహరి రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో కొత్తపల్లి గ్రామంలో విషాద సాయలు నెలకొన్నాయి.

ALSO READ : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!

మరిన్ని వార్తలు