Road construction : ఇర్విన్ లో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు భూమి పూజ..!

మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామంలో కల్వకుర్తి ఎమ్మెల్యే శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద మంజూరు చేసిన నిధులతో నిర్మించనున్న సిసి రోడ్లకు గురువారం మాడ్గుల మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సూదిని శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు.

Road construction : ఇర్విన్ లో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు భూమి పూజ..!

రంగారెడ్డి జిల్లా, మాడ్గుల, :మన సాక్షి:

మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామంలో కల్వకుర్తి ఎమ్మెల్యే శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద మంజూరు చేసిన నిధులతో నిర్మించనున్న సిసి రోడ్లకు గురువారం మాడ్గుల మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సూదిని శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పాలకుర్ల శ్రీనివాస్ గౌడ్, తాజా మాజీ వార్డ్ మెంబర్దు చిందుల చంద్రయ్య, ఎస్ఎంసి చైర్మన్ గుండె వెంకటేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా యువజన నాయకులు గాదేమోని చంద్రశేఖర్ గౌడ్, ఇర్విన్ గ్రామ యువజన నాయకులు ఎరుకలి శివ గౌడ్, పెంటమల్ల శ్రీశైలం, బూడిది పర్వతాలు, సుధాకర్, కాలనీవాసులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఇర్విన్ గ్రామానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కి ఇర్విన్ గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మండల రైతు సమితి మాజీ అధ్యక్షులు సూదిని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.