లోక్ సభ సాధారణ ఎన్నికలలో నోడల్ అధికారుల పాత్ర ముఖ్యం..!

రానున్న లోక్ సభ సాధారణ ఎన్నికలలో నోడల్ అధికారుల పాత్ర ముఖ్యమని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. నోడల్ అధికారులందరు వారి బాధ్యతలను ,వారి పాత్రను తెలుసుకొని ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని తెలిపారు.

లోక్ సభ సాధారణ ఎన్నికలలో నోడల్ అధికారుల పాత్ర ముఖ్యం..!

నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి

నల్లగొండ, మన సాక్షి:

రానున్న లోక్ సభ సాధారణ ఎన్నికలలో నోడల్ అధికారుల పాత్ర ముఖ్యమని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. నోడల్ అధికారులందరు వారి బాధ్యతలను ,వారి పాత్రను తెలుసుకొని ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని తెలిపారు. సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ని సమావేశ మందిరంలో పార్లమెంట్ ఎన్నికలకు నియమించబడిన నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సుమారు 20 మంది జిల్లా అధికారులను నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు.

ALSO READ : జగన్ వీడియోలతో చంద్రబాబు ట్వీట్.. ఆ వీడియోలు ఏంటో చూడండి..!

సీనియర్ సిటీజన్లు,ట్రాన్స్ జెండర్లు, దివ్యంగ ఓటర్ల హోమ్ వోటింగ్ విధానం ఓటు హక్కు,ఓటు ప్రాధాన్యత పై డిగ్రీ కళాశాలలు, ఉన్నత విద్య సంస్థలలో అవగాహన కార్యక్రమాల నిర్వహన, మాడల్ పోలింగ్ కేంద్రాలను మంచి డిజైన్లతో రూపందించడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు,సి -విజిల్,ఫిర్యాదుల స్వీకరణ,పోస్టల్ బ్యాలెట్,పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు తదితర అంశాలపై నియమించబడిన నోడల్ అధికారులు వారి విధులు జాగ్రత్తగా నిర్వహించాలన్నారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్,అదనపు ఎస్ పి రాములు నాయక్,పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ కోటేశ్వర రావు,జెడ్ పి సి ఈ ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి,నోడల్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ALSO READ : ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. భార్య నోట్లో గుడ్డలు కుక్కి భర్తను..!