ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. భార్య నోట్లో గుడ్డలు కుక్కి భర్తను..!

ఆంధ్రప్రదేశ్ లో ని నెల్లూరు జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్రసాద్ అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా పొడిచి చంపారు.

ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. భార్య నోట్లో గుడ్డలు కుక్కి భర్తను..!

మన సాక్షి :

ఆంధ్రప్రదేశ్ లో ని నెల్లూరు జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్రసాద్ అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు ప్రసాద్ పై కత్తులతో దాడి చేశారు. అడ్డు వచ్చిన భార్య నోట్లో గుడ్డలు కుక్కి ఆమె కళ్ళ ఎదుటనే చిత్రహింసలకు గురిచేసి హతమార్చినట్లు సమాచారం.

ప్రసాద్ స్థానికంగా ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి శరీరం పై 25 పైగా కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ ఆధారంగా వివరాలను సేకరించారు.

పాత కక్షల కారణంగా కొందరితో ఉన్న విభేదాల వల్లనే ప్రసాద్ ను హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ALSO READ : జగన్ వీడియోలతో చంద్రబాబు ట్వీట్.. ఆ వీడియోలు ఏంటో చూడండి..!