BREAKING : స్టీరింగ్ విరిగి ఆర్టీసీ బస్సు బోల్తా

స్టీరింగ్ విరిగి ఆర్టీసీ బస్సు బోల్తా
అమరావతి, మన సాక్షి :
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో స్టీరింగ్ విరిగి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది . ఈ బస్సు శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళుతుండగా కోమర్తి జంక్షన్ వద్ద ప్రమాదం సంభవించింది. స్టీరింగ్ విరగడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో డ్రైవర్ తో సహా 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయాలైన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జాతీయ రహదారిపై బస్సు బోల్తాపడటంతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.