New scheme : రైతులకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. దిగి రానున్న ఎరువుల ధరలు..!
రైతులకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. దిగి రానున్న ఎరువుల ధరలు..!
మనసాక్షి, వెబ్ డెస్క్ :
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది . ఎరువుల బ్రాండ్ అంతా ఒకే బ్రాండ్ కింద విక్రయించేలా నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్.. వన్ ఫర్టిలైజర్ స్కీం కింద ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో ఇకపై భారత్ పొటాష్ , భారత్ యూరియా, భారత్ ఎన్ పీకె (కాంప్లెక్స్ ఎరువులు) పేరిట అమ్మకాలు జరగనున్నాయి. ఈ వానకాలం సీజన్ నుంచే ఒకే బ్రాండ్ కింద ఎరువుల అమ్మకాలు జరగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకుల ధరలు తగ్గడంతో రాబోయే రోజుల్లో పెరుగుల ధరలు తగ్గే అవకాశం ఉంది.
దిగి వస్తున్న ఎరువుల ధరలు :
వానా కాలంలో సీజన్ లో రైతులకు కొంత ఊరాట కలుగనున్నది. ఎరువుల ధరలు కాస్తా తగ్గుతుండటంతో రైతులు కొంత ఊపిరి తీసుకోనున్నారు. రాబోయే వానాకాలం సీజన్ లో రైతులకు సాగు భారం కొంతమేరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడి తడిసి మోపెడవుతున్న రైతులకు ఎరువుల ధరలు కాస్త తగ్గితే కొంత కోరట కలగనున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి పదార్థాల ధరలు భారీగా తగ్గడంతో ఆయా కంపెనీలు ఎరువుల రేట్లు తగ్గించేందుకు సమాయత్తమవుతున్నాయి .ఇప్పటికే 20 : 20 : 0 : 13 ఎరువు 150 రూపాయలు తగ్గింది.
గత ఏడాది భారీగా పెరిగిన ధరలు :
గత ఏడాది కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి . 20 : 20 : 0 :13 రకం 50 కిలోల బస్తా ఎరువు 850 రూపాయల నుంచి 1350 రూపాయలకు చేరింది. 14 : 35 : 14 , 28 : 28 : 0 , 10 : 26 : 26 రకం 1500 రూపాయలకు పెరిగింది. ఇక పొటాష్ ధర మాత్రం భారీ సంఖ్యలో 1700 రూపాయలకు చేరింది. దాంతో పొటాష్ వాడకాన్ని రైతులు పూర్తిగా తగ్గించారు. డీలర్లు కూడా పొటాషియం కొనుగోలు చేయటం ఆపేశారు.
అదే విధంగా గత ఏడాది డిఏపి ధరలను కూడా 1700 నుంచి 1900 రూపాయలకు పెంచారు. కానీ కేంద్ర ప్రభుత్వం రాయితీ పెంచడంతో కంపెనీలు ధరలు తగ్గించి 1350 రూపాయలకు విక్రయించాయి.
రాబోయే వానకాలం భారీగా తగ్గనున్న ఎరువుల ధరలు :
రాబోయే వానాకాలం సీజన్ లో రైతులకు కాస్త ఊరట కలగనున్నది. ఇప్పుడిప్పుడే ఎరువుల ధరలు దిగి వస్తున్నాయి. యాసంగి సీజన్ లో ఎరువుల బస్తా ధర 1350 రూపాయలు ఉండగా ప్రస్తుతం 1200 రూపాయలకు దిగి వచ్చింది. సాధారణంగా రైతులు ఒక ఎకరాకు రెండు బస్తాల ఎరువు వాడుతారు. ఆ విధంగా చూస్తే ఒక్కో బస్తాకు 150 రూపాయల చొప్పున 300 రూపాయలు రైతులకు తగ్గనున్నది.
1350 రూపాయలు ఉన్న కాంప్లెక్స్ ఎరువుల బస్తా ధర 20 : 20 : 0: 13 నెలకు 50 రూపాయల చొప్పున ప్రస్తుతం తగ్గుతూ 1200 రూపాయలకు చేరింది. మరో నెల రోజుల్లో అన్ని రకాల కాంప్లెక్స్ చెరువుల బస్తా ధర 200 రూపాయల నుంచి 300 వరకు తగ్గే అవకాశం ఉంది.










