Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంహైదరాబాద్

తెలంగాణ : రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, రూ.10 వేల సహాయం ఎప్పటినుంచంటే..?

తెలంగాణ : రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, రూ.10 వేల సహాయం ఎప్పటినుంచంటే..?

మనసాక్షి , హైదరాబాద్ :

తెలంగాణలో అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

 

అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను గత నెల 23వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించడంతో పాటు ఖమ్మం, వరంగల్ జిల్లాలో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను కూడా పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 

పంటలు నష్టపోయిన వివరాలను వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహించి సేకరించారు. ఆ సర్వే ఆధారంగా పంట నష్ట నష్టపరిహారంగా రైతులకు ప్రభుత్వం చెక్కులు అందజేయాలని నిర్ణయించారు. పంటలు నష్టపోయిన రైతుల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించిన అధికారులు ఈనెల 12వ తేదీ నుంచి నష్టపరిహారం పంపిణీ చేయనున్నారు.

 

పంటలు నష్టపోయిన రైతులతో పాటు, కౌలు రైతులను కూడా గుర్తించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి రైతులకు పంట నష్టపరిహారం అందే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు