Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవిద్య

Miryalaguda : విద్యార్థుల ప్రాణ భద్రతే ప్రథమ కర్తవ్యం..!

Miryalaguda : విద్యార్థుల ప్రాణ భద్రతే ప్రథమ కర్తవ్యం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

విద్యార్థుల ప్రాణ భద్రతే ప్రధాన కర్తవ్యం కావాలని జిల్లా రవాణా కమిషనర్ ఆర్. వాణి అన్నారు. శనివారం ట్రస్మా మిర్యాలగూడ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల బస్సుల భద్రతపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా రవాణా కమిషనర్ ఆర్. వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాల బస్సు డ్రైవర్లు క్రమశిక్షణతో, జాగ్రత్తగా బస్సులు నడపాలని, విద్యార్థులను సురక్షితంగా ఇంటివద్ద దింపి మరల పాఠశాలకు తీసుకురావాలని సూచించారు. మొబైల్ ఫోన్లు వాడకుండా, ఓవర్ స్పీడ్‌కి పాల్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. విద్యార్థుల ప్రాణ భద్రతే ప్రధాన కర్తవ్యం కావాలని, ప్రతి డ్రైవర్ దానిని తమ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మండల విద్యాధికారి బాలునాయక్, ట్రస్మా రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ వంగాల నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస చారి, పట్టణ అధ్యక్షులు వరప్రసాద్, సెక్రటరీ శ్యాం సుందర్, ట్రెజరర్ శ్రీధర్ రెడ్డి, నాయకులు మధుసూదన్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, నర్సి రెడ్డి, వెంకట్, సలీం, దామోదర్, సురేందర్ రెడ్డి, జయరాజు, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nizamabad : ఇరాక్ లో ఆలూర్ వాసి మృతి..!

  2. Hello Srinivas : హలో శ్రీనివాస్.. విశిష్టమైన ఐక్యత.. 26న శ్రీనివాస్ పేరు గల వ్యక్తుల ఆత్మీయ సమ్మేళనం..!

  3. Nalgonda : పిన్ని కూతురిని గర్భవతిని చేసిన అన్న.. 21 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష..!

  4. District Collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. టార్గెట్స్ పూర్తి చేయాలి..!

మరిన్ని వార్తలు