మిర్యాలగూడ : కెసిఆర్ నాయకత్వంలో సహకార వ్యవస్థ బలోపేతం

మిర్యాలగూడ : కెసిఆర్ నాయకత్వంలో సహకార వ్యవస్థ బలోపేతం

మిర్యాలగూడ టౌన్,, మన సాక్షి:

సీ.ఎం కేసీఆర్ నాయకత్వంలోనే సహకార వ్యవస్థ బలోపేతం అయిందని, సహకార వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు.

 

శనివారం వేములపల్లి మండల కేంద్రంలోని సల్కునూరు గ్రామంలో సహకార సహకార సంఘం సొసైటీకి నాబార్డు ద్వారా 25 లక్షల రూపాయల వ్యయంతో మంజూరైన గోడౌన్ ను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సహకార సంఘం చైర్మన్ గడ్డం స్పురధర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

 

Also Read : Adipurush : ‘ఆదిపురుష్’ బ్లాక్ బస్టర్.. రామాయణమేనా ..? మరోకథనా..?

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ.ఎం కే.సీ.ఆర్ రైతుల పక్షపాతి అన్నారు. ప్రతి ఇంట్లో సంక్షేమం…. ప్రతి ముఖంలో సంతోషం చూడాలనే సీ.ఎం కే.సీ.ఆర్ లక్ష్యం అని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే కే.సీ.ఆర్ గారి అభిమతం అని కొనియాడారు.

 

రాష్ట్రంలో సంపదను పెంచి… పేదలకు పంచడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి , మండల పార్టీ అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, నాయకులు ఇరుగు వెంకటయ్య,

 

Also Read : TSRTC : టిఎస్ ఆర్టీసి ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. రూ .100 తో 60 కిలోమీటర్లు రాను పోను..!

 

మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ పేరాల కృపాకర్ రావు, సర్పంచ్ అంకపాక రాజు, ఎం.పీ.టీ.సీ గడ్డం రాములమ్మ వెంకన్న, డైరెక్టర్లు పళ్ళ బిక్షం, లింగయ్య, రవీందర్ రెడ్డి, బొమ్మగాని హరికృష్ణ, జానకిరాములు, వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, జయసుధ, రాము నాయక్ భూపతి సైదులు, జానకమ్మ, తదితరులు పాల్గొన్నారు….