Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు

Miryalaguda : 15న సంత్ సేవలాల్ జయంతి.. మిర్యాలగూడ సబ్ కలెక్టర్..!

Miryalaguda : 15న సంత్ సేవలాల్ జయంతి.. మిర్యాలగూడ సబ్ కలెక్టర్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఈనెల 15న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగే సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో సంత్ సేవలాల్ జయంతి ఉత్సవాల నిర్వహణ విషయమై బంజారా సంఘా నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

బంజారాల అత్యంత వైభవంగా జరుపుకునే సేవలాల్ జయంతి వేడుకలకు బంజారా ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుందని అందుకు అవసరమైన నిధులను మంజారు చేసిందని తెలిపారు.

మిర్యాలగూడలో మండల పరిషత్ కార్యాలయం నుండి క్యాంప్ లోని బంజారా భవన్ వరకు జరిగే ర్యాలికి బంజరాలకు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అనంతరం బంజారాల ఆచారాలకు అనుగుణంగా మహా బోగ్ బండరో కార్యక్రమం వుంటుందని చెప్పారు.

కార్యక్రమంలో ఎంఆర్ఓ హరిబాబు, ఎంఇఓ బాలాజీ, బాలు, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, తిరుపతి, భాస్య నాయక్, సత్యనారయణ, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ..!

  2. Nalgonda : అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత.. నలుగురిపై కేసు నమోదు..!

  3. Nalgonda : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 22 మంది అభ్యర్థులు..!

  4. Hyderabad : కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. నాచారం వాసులుగా గుర్తింపు..!

మరిన్ని వార్తలు