మిర్యాలగూడ : సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి
మిర్యాలగూడ : సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్పూర్తితో ఉద్యమించాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా బుధవారం మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు భూమి కోసం,భుక్తి కోసం, విముక్తి కోసం ఎర్రజెండా చేతబూని వీరోచిత పోరాటం నడిచిందన్నారు.ఆ పోరాట ఫలితంగా పేదలకు పది లక్షల ఎకరాల భూమి పంచబడిందన్నారు. అనేక గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పాటయ్యాయి అన్నారు.
నేటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించారని విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందని ద్రాక్ష లాగా మిగిలి పోతున్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు.
ALSO READ :
- Crime News : దొంగతనాలకు పాల్పడుతున్న ట్రాన్స్ జెండర్స్.. చాకచక్యంగా పట్టుకున్న చౌటుప్పల్ పోలీసులు..!
- Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
- సూర్యాపేట : ఏపూర్ గ్రామాన్ని సందర్శించిన ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలన్నారు. తడకమళ్ళ గ్రామంలో దేవిరెడ్డి లక్ష్మి నరసింహా రెడ్డి, గుండా వెంకటేశ్వర్లుని నిజం సైన్యం గాజుల మల్కాపురం గుట్ట లో కాల్చి చంపారు. గట్టికొప్పుల రాంరెడ్డి, అనంత్తుల వెంకయ్య, దేవిరెడ్డి లక్ష్మ రెడ్డి, బిరెల్లి మట్టారెడ్డి పోరాడి అమరవీరుయ్యారని వారి పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవినాయక్, జిల్లా కమిటీ సభ్యులు చౌగాని సీతారాములు, గ్రామ ఉప సర్పంచ్ సైదమ్మ, సీపీఎం మండల నాయకులు నాగేష్, వెంకన్న, బాబు నాయక్, సోషల్ మీడియా డివిజన్ కో-కన్వీనర్ పతాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :










