Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుమహబూబాబాద్ జిల్లా

Seeds : విత్తన దుకాణాదారులకు హెచ్చరిక.. ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు..!

నకిలీ విత్తనాల పేరిట రైతులను మోసం చేసే వ్యక్తులు,డీలర్లపై చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకుంటామని నర్సింహులపేట మండల వ్యవసాయ శాఖ అధికారి వినయ్ కుమార్, ఎస్సై భూక్య వెంకన్న హెచ్చరించారు.

Seeds : విత్తన దుకాణాదారులకు హెచ్చరిక.. ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు..!

మనసాక్షి, నర్సింహులపేట,

నకిలీ విత్తనాల పేరిట రైతులను మోసం చేసే వ్యక్తులు,డీలర్లపై చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకుంటామని నర్సింహులపేట మండల వ్యవసాయ శాఖ అధికారి వినయ్ కుమార్, ఎస్సై భూక్య వెంకన్న హెచ్చరించారు.

శనివారం రోజున వానాకాలం సాగు సీజన్ నేపథ్యంలో మండలంలోని భారతీట్రేడర్స్, మహేంద్ర ఫెర్టిలైజర్స్,పెస్టిసైడ్స్, సీడ్స్, లక్ష్మిసాయి ఫెర్టిలైజర్స్ విత్తన దుకాణాలను వ్యవసాయ, పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఏవో మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతించిన కంపెనీల విత్తనాలను మాత్రమే విక్రయించాలని డీలర్లకు సూచించారు. అనుమతి లేని విత్తనాల విక్రయం,ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అమ్మకాలు,రైతులకు రసీదులు ఇవ్వకపోవడం వంటి ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు.

రైతులను మభ్యపెట్టి నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై విత్తన చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు తయారీ తేదీ,లాట్ నంబర్, కంపెనీ పేరు,ప్యాకెట్ నాణ్యతను పరిశీలించాలని, అనుమతి పొందిన విత్తన దుకాణాల్లోనే కొనుగోళ్లు చేయాలని సూచించారు. కొనుగోలు చేసిన రసీదులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలని తెలిపారు.ఈతనిఖీల్లో వ్యవసాయ శాఖ,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు