సీతక్క కన్ఫ్యూజన్ అయిందా ..?, క్లారిటీ ఇచ్చిన సీతక్క

సీతక్క కన్ఫ్యూజన్ అయిందా ..?, క్లారిటీ ఇచ్చిన సీతక్క

హైదరాబాద్, మనసాక్షి : రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క ఓటు వేసే విషయంలో కన్ఫ్యూజన్ అయ్యిందా..? అనే విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమె ఒకరికి ఓటు వేయబోయి మరొకరికి ఓటు వేసిందంటూ ప్రచారం సాగుతుంది.

ALSO READ : ఫ్లాష్ .. ఫ్లాష్.. గుర్తు తెలియని మృతదేహం లభ్యం

కాగా ఈ విషయంపై సీతక్క క్లారిటీ ఇచ్చింది. తాను ఆత్మసాక్షి మేరకే ఓటు వేశానని, ఎలాంటి కన్ఫ్యూజన్ కాలేదని పేర్కొన్నది. తాను ఓటు వేసే బ్యాలెట్ పై మార్క్ పడటం వల్ల పోలింగ్ అధికారిని మరో బ్యాలెట్ అడిగానని చెప్పింది. ఓటు వేసే విషయంలో ఎలాంటి తప్పులు దొర్ల లేదని ఆమె పేర్కొన్నది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేశానని చెప్పారు. కావాలనే కొంతమంది తనపై దృష్టి పచారం చేస్తున్నారని తెలిపారు .