District collector : జిల్లా కలెక్టర్ సంచలన ప్రకటన.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఆ.. జాబితాలు నమ్మొద్దు..!
District collector : జిల్లా కలెక్టర్ సంచలన ప్రకటన.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఆ.. జాబితాలు నమ్మొద్దు..!
నల్లగొండ, మన సాక్షి :
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసాలపై అనుమతి పొందిన లబ్ధిదారుల జాబితాల పేరుతో సామాజిక మాధ్యమాలు, గ్రామాలలో విడుదల చేస్తున్న బోగస్ జాబితాలను ఎవరు నమ్మవదని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి పొందిన జాబితాలు విడుదల చేయలేదన్నారు. మండల స్థాయిలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చెప్పిన, అనుమతించిన జాబితాలను మాత్రమే ప్రజలు నమ్మాలి అన్నారు.
జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామపంచాయతీలు, మున్సిపల్ వార్డులలో ఆయా పథకాల కింద లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాల జాబితా అంటూ గ్రామాలు, సామాజిక మధ్యమాలలో సర్క్యూలేట్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇది ఎంత మాత్రం నిజం కాదు.
అన్నారు. ప్రజలు ఎవరు ఈ విషయాలను నమ్మవద్దు అని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామసభలలో ఆయా పథకాల కింద ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల పేర్లు మాత్రమే చదువుతున్నాము అని అన్నారు. ఇవి ఎట్టి పరిస్థితులలో ఆమోదించిన జాబితాలు కాదు. అంతే కాక ఇది తుది జాబితాలు కూడా కాదు ఆయా పథకాలకు గ్రామసభలలో మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నాము.
ప్రజా పాలన సందర్భంగా సమర్పించిన దరఖాస్తులు, రాష్ట్ర ప్రజావాణిలో, జిల్లా ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులు, కుటుంబ సర్వే సందర్భంగా సమర్పించిన దరఖాస్తులు, అలాగే ప్రస్తుతం గ్రామ సభల్లో సమర్పించిన దరఖాస్తులు ప్రజా పాలన మీసేవ కేంద్రాలలో సమర్పించిన అన్ని దరఖాస్తులను క్రోడీకరించి, పరిశీలించిన మీదట మాత్రమే అర్హత జాబితాను తయారు చేయడం జరుగుతుంది.
అందువల్ల ప్రజలు ఎవరు ఇతరుల మాటలను నమ్మి మోసపోవద్దని కలెక్టర్ కోరారు.
MOST READ ;
-
Rythu Bharosa : రైతు భరోసా కు కొత్తగా దరఖాస్తుల ఆహ్వానం.. బిగ్ అప్డేట్..!
-
SBI : SBI సేవింగ్ అకౌంట్ లో రూ.236 కట్ అవుతున్నాయా.. ఖాతాదారుల గందరగోళం.. ఎందుకంటే..!
-
TG News : వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. జాబితా రెడీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)
-
Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!









