Bandi Sanjay : హరీష్ రావు పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్..!
Bandi Sanjay : హరీష్ రావు పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్..!
మన సాక్షి , కరీంనగర్ :
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. కెసిఆర్, కేటీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, హరీష్ రావు మంచి వ్యక్తిని అన్నారు. హరీష్ రావు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, ఆయనకు మంచి పొజిషన్ ఉందన్నారు.
తాను ఇలా అంటున్నందుకు తనతో మాట్లాడినట్టుగా భావించవద్దని, హరీష్ రావుతో మాట్లాడలేదని, ఒకవేళ ఆయన బిజెపిలోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాల్సిందే అని బండి సంజయ్ పేర్కొన్నారు. రాజీనామా చేసి పార్టీలోకి వచ్చినా జనాబలం ఉన్న వ్యక్తి కాబట్టి మళ్లీ గెలుస్తాడని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
Cm RevanthReddy : పరీక్షలు వాయిదా ఎందుకు వేయమంటున్నారో చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. (వీడియో)
TGSRTC : ప్రయాణికులకు TGSRTC మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు ఏసీ బస్సులు..!









