బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న శక్తి పీఠం

బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న శక్తి పీఠం

పేట లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

నారాయణపేట టౌన్,  మన సాక్షి:
నారాయణపేట జిల్లా సుభాష్ రోడ్డు లోని శక్తి పీఠం శ్రీ సంత్ మఠ్ మూల మహసంస్థానం లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

.ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 15 నుండి 24 వరకు పదిరోజులు దేవి శరన్నవరాత్రి ఉత్సవములు వైభవోపేతంగా నిర్వహించనున్నట్లూ శక్తిపీఠం నిర్వహాకులు స్వామి శాంతానంద్ తెలిపారు. ఇట్టి బ్రహ్మోత్సవాలకు శక్తిపీఠం ముస్తాబవుతున్నది.

బ్రమ్మోత్సవాలలో సాముహిక కుంకుమార్చన, అమ్మవారికి ఒడి బియ్యం పోసే కార్యక్రమం , సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించబడునని ఈ కార్యక్రమానికి సద్భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని శక్తిపీఠం సభ్యులు కోరుతున్నారు.

ALSO READ : Viral : మనిషి చనిపోయిన తర్వాత ఇలా ఉంటుందా.. ఎలా ఉంటుందో తెలిసిపోయింది..!