ఎస్సై దిలీప్ కు ఘనంగా వీడ్కోలు

ఎస్సై దిలీప్ కు ఘనంగా వీడ్కోలు

చౌటుప్పల్. మన సాక్షి.

చౌటుప్పల్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించి ప్రమోషన్ పై వెళ్తున్న ఎస్సై దిలీప్ కు సీఐ దేవేందర్ ఆధ్వర్యంలో ఎస్సై ధనుంజయ్, ఎస్సై యాదగిరి, పోలీస్ సిబ్బంది శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో వీడ్కోలును ఘనంగా నిర్వహించి పూలమాలవేసి దిలీప్ ను శాలువతో సత్కరించారు.

 

ఈ సందర్భంగా సిఐ దేవేందర్ మాట్లాడుతూ దిలీప్ అంకితభావంతో విధులు నిర్వహించాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్సై దిలీప్ మాట్లాడుతూ ఇంతకాలం తనకు సహాయ సహకారాలు అందించిన తన తోటి పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

 

ALSO READ : 

1. Restarent : ఆ రెస్టారెంట్ లో తినాలంటే నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలంట.. స్పెషల్ ఏంటో..?

2. Womens : నిరుపేద మహిళలు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు..!

3. Chicken : చికెన్ కిలో రూ.100 మాత్రమే.. గంటలోనే అన్ని షాపుల్లో ఖాళీ..!