SI POST : కష్టపడ్డారు.. కలలు నెరవేర్చారు ..!

SI POST : కష్టపడ్డారు.. కలలు నెరవేర్చారు ..!

మనసాక్షి :

కష్టపడి చదివారు.. పేదరికం చేయించి తల్లిదండ్రులుగా కలలు నెరవేర్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సివిల్ ఎస్సై పోస్టులలో ఉద్యోగాలు సాధించారు.

 

పేద కుటుంబంలో జన్మించి ఎస్సైగా ఎంపిక

అనంతగిరి :

చిన్న వయసులో ఎస్సై ఉద్యోగం సాధించిన ను అభినందిస్తున్న గ్రామస్తులు , ఉపాధ్యాయులు
అనంతగిరి మండల పరిధిలో వాయిల సింగారం గ్రామానికి చెందిన చట్టు వినయ్, సివిల్ ఎస్ఐ గా ఎంపికయ్యారు . చిన్న వయసులో ఎస్సైగా ఎంపిక కావడంతో గ్రామస్తులు అతన్ని అభినందిస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవ చేసేందుకు ఈ వృత్తిని ఎంచుకున్నట్లు వినయ్ తెలిపారు.

 

కుమారుడు పోలీసు ఉద్యోగాలు సాధించడంతో తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుకు పేద మధ్య తరగతి అనే భేదాలు లేకుండా కష్టపడి చదివి తల్లిదండ్రులు ఆశయాలను నెరవేర్చాలి అని అన్నారు. చిన్నతనం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివి నేడు సివిల్స్ ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యాను. వినయ్ చిన్నతనం నుండి చదువులో ముందంజలో ఉంటూ నేడు ఈ విజయానికి దోహద పడింది. ఉపాధ్యాయులు సైతం వినయ్ ను అభినందిస్తున్నారు.

 

సివిల్ ఎస్సైగా ఉగ్గం లైలా

అర్వపల్లి :

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సివిల్ ఎస్సై పోస్టులలో మండల పరిధిలోని చెందిన కుంచమర్తికి చెందిన ఉగ్గం లైలా ఎంపికైనట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఎస్సై అభ్యర్థిగా విజయం సాధించిన లైలా అత్తమామలు కుంచమర్తి సర్పంచ్ ఉగ్గం ఉపేంద్ర లింగరాజు .

 

చిన్నప్పటినుండి చదివించి ఉద్యోగం వచ్చేంతవరకు ప్రోత్సహించిన తల్లిదండ్రులు శాలిగౌరారం మండలం వల్లాల చెందిన కంచు గట్ల లింగయ్య అంజమ్మ వీరి ఆధ్వర్యంలోనే ఉన్నత చదువులు చదివి ఈ ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిపారు కంచికట్ల లైలా ఎస్సైగా ఎంపీ గ కావడంతో భర్త కిషోర్ తో పాటు అత్తగారి గ్రామమైన కుంచమర్తి తల్లి గారి గ్ర మమైన వల్లలలో స్నేహితులు అభిమానులు సంబరాలుజరుపుకుంటున్నారు.

 

పట్టు పట్టాడు..! కొలువు కొట్టాడు..!

కుల్కచర్ల :

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని బొమ్మిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన దళితవాడలో పుట్టి దళిత యువశక్తి యువజన సంఘం అధ్యక్షులు కృష్ణయ్య కుమారుడు చంద్రకాంత్ సివిల్ ఎస్సైగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తల్లిదండ్రులు మాట్లాడుతూ…

 

దళితవాడ నుంచి మా మండలంలోని ఎస్సై గా ఎన్నిక కావడం హర్షం వ్యక్తం చేశాడు. అతి చిన్న వయసులోనే మా కుమారుడు సివిల్ ఎస్సైగా ఎన్నిక కావడం చాలా సంతోషమని ఇంకా మరెన్నో ఉన్నతమైన పదవులు సాధించాలని పాం బండ రామలింగేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామని అన్నారు.