District Collector : జాతీయ రహదారులపై సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District Collector : జాతీయ రహదారులపై సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
సూర్యాపేట, మనసాక్షి:
వెబేక్స్, వీడియో కాన్పిరెన్స్ ద్వారా రోడ్ల భద్రత పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. గత నెలలో జరిగిన సమావేశం లో జిల్లాలో ని అన్ని జాతీయ రహదారు లపై గుర్తించిన బ్లాక్ స్పాట్స్ పై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఆర్ డి ఓ సూర్యాపేట వేణుమాధవ్ మాట్లాడుతూ పిల్లలమర్రి నుండి ఈనాడు అఫిస్ వరకు బ్లాక్ స్పాట్స్ గుర్తించటం జరిగిందని అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రమాదాలు అధికంగా జరిగే 22 లొకేషన్స్ లో సైన్ బోర్డ్ లు, డంబెల్ స్ట్రిక్స్ ఏర్పాటు చేయవలసి ఉంది కానీ 4 లొకేషన్స్ లలో మాత్రమే ఏర్పాటు చేసారని మిగిలిన లొకేషన్స్ లలో త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఖమ్మం బైపాస్ సర్వీస్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్స్, ర్యాంప్ లు ఏర్పాటు చేయాలని ఖమ్మం జాతీయ రహదారి అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
ఖమ్మం నుండి సూర్యాపేట ఎన్ హెచ్ 365 బి అన్ని భద్రత చర్యలు ఒక నెల రోజులలో పూర్తి చేస్తామని
డి ఈ రాహుల్ తెలిపారు.అన్ని జాతీయ రహదారులపై తీసుకున్న భద్రత చర్యలకి సంబందించిన వివరములను సమర్పించాలని సూచించారు. జనగాం క్రాస్ రోడ్డు లో జరుగుతున్న పనుల వల్ల ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డైవర్శన్ చేయాలని సూచించారు.
కోదాడ జాతీయ రహదారి 67 వద్ద గల అప్రోచ్ రోడ్డు మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకి సూచించారు. కోదాడ – మిర్యాలగూడ రోడ్డు లో గోవిందాపురం వద్ద అలాగె మరకోన్ని మలుపుల వద్ద సైన్ బోర్డులు, లైటింగ్ లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ఉన్న అంతర్గత రోడ్ల మరమ్మతుల పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని అలాగే మున్సిపల్ కమిషనర్ ల పరిధిలో గల రోడ్ల మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. చేపట్టిన పనులపై నివేదిక అందజేయాలనీ కలెక్టర్ ఈ ఈ ఆర్ & బి సీతరామయ్య కూ సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస రాజు, ఆర్ అండ్ బి,,ఎన్ హెచ్ ఐ అధికారులు పాల్గొన్నారు.
MOST READ :
-
Nalgonda : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. దామరచర్లకు చెందిన బాలింత మృతి..!
-
Gold Price : మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఆనందంలో పసిడి ప్రియులు..!
-
Heater water : చలికాలం హీటర్ వాటర్‌తో స్నానం చేస్తున్నారా.. అయితే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!
-
Smoking : ఛాయ్ తాగుతూ.. స్మోకింగ్ చేయోచ్చా.. తెలుసుకోవల్సిందే..!
-
TGB : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో మరో బ్యాంకు విలీనం.. కస్టమర్లు తెలుసుకోవాలి..!









