Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

వేములపల్లి : సారూ.. జర నన్ను పట్టించుకోండ్రి..!

వేములపల్లి : సారూ.. జర నన్ను పట్టించుకోండ్రి..!

క్షేమంగా గమ్యానికి చేర్చే నేనే ప్రమాదలకు కారణమవుతున్న కల్వర్ట్

కల్వర్ట్ నిర్మించి తారు వేయాలని ప్రయాణికుల వేడుకొలు

Vinay Goud, Mana Sakshi :

నన్నెవరూ పట్టించుకోవడంలేదని భీమవరం సూర్యాపేట రోడ్డు ఆవేదన వ్యక్తం చేస్తుంది. ప్రజల ను సురక్షితంగా గమ్యానికి చేర్చాల్సిన నేనే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన ప్రజల ప్రాణాలు తీయాల్సి వస్తుందని రోడ్డు గోస పడుతుంది .

గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. వీటిలో భాగంగా కల్వర్టులు నిర్మించకపోగా, ఈ కల్వర్టులు ప్రమాదకరంగా మారాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.

ALSO READ : తాను చనిపోతూ.. ఏడుగురికి ప్రాణం పోసిన పెంటయ్య..!

వేములపల్లి మండల పరిధిలోని సల్కునూరు పెట్రోల్ బంక్ దగ్గర ప్రమాదకరంగా రోడ్డుపై గుంతలు పడ్డాయి. రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు పూర్తి కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

చినుకు పడితే చిత్తడిగా మారే పరిస్థితి ఏర్పడింది. వర్షం వస్తే చెరువును తలపించే విధంగా గుంటలు పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షానికి గుంటలు నిండి చెరువులను తలపిస్తున్నాయి. గోదాం వద్ద ఉన్న కల్వర్టు ప్రమాదకరంగా మారింది.

ALSO READ : చెరువులోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం..!

వర్షం కురిసినప్పుడు గుంట నిండా నీళ్లు నిలవడంతో వాహనాదారులు ఎటు వెళ్ళాలో తెలియక ప్రమాదానికి గురవుతున్నారు. రోడ్డు ఇరువైపులా గుంతలు తీసి…. సూచికలు పెట్టడం మర్చిపోయారు.దీంతో పలు ప్రమాదాలు కూడా జరిగాయి.

ఎదురుగా వాహనం వస్తే.. మరో వాహనం పక్కకు ఆపుకునే పరిస్థితి ఏర్పడింది. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి కల్వర్ట్ నిర్మించి తారు ను వేయాలని ప్రయాణికులు కోరూతున్నారు .

ALSO READ :

  1. Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!
  2. Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!

మరిన్ని వార్తలు