చెరువులోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం..!
చెరువులోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. తప్పిన పెను ప్రమాదం..!
వికారాబాద్ జిల్లా పరిగి, మన సాక్షి:
వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రైవేట్ స్కూల్ బస్సు చెరువులోకి దూసుకుపోయింది. ఈ సంఘటన బస్సులో ఉన్న విద్యార్థులను, స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ఈ ప్రమాదంలో స్కూల్ బస్సులో ఉన్న 40 మంది విద్యార్థులకు ప్రమాదం తృటిలో తప్పింది.
దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు . వివరాల ప్రకారం.. 40 మంది విద్యార్థులతో వెళుతున్న పాఠశాల బస్సు వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని సుల్తాన్ పూర్ వద్ద చెరువులోకి దూసుకెళ్లింది.
ALSO READ : Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!
ఈ క్రమంలో బస్సులోని విద్యార్థులను స్థానికులు కాపాడారు. చెరువులోకి దూసుకెళ్లిన బస్సు న్యూ బ్రిలియంట్ స్కూల్ కు చెందిన బస్సు గా గుర్తించారు. స్కూల్ బస్సు స్టీరింగ్ పనిచేయకపోవడంతో పోవడంతో ప్రమాదం జరిగినట్లుగా డ్రైవర్ చెప్పుకొచ్చాడు.
ఈ ప్రమాదం నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి హాని కలగకపోవడంతో పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు. కానీ పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ : Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!









