Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు..!

Miryalaguda : వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు..!

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి :

వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతుందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాంప్ కార్యాలయంలో మరో రెండు గ్యారెంటీలను అమలు చేసిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నర నెలల్లోనే 4 పథకాలను అమలు చేసిందన్నారు.ఇచ్చిన హామీ ప్రకారం 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత ఇప్పుడే ప్రజా పాలన ప్రారంభమైందని,ప్రజల ప్రభుత్వంగా పరిపాలన పని చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ తమ్మడబోయిన అర్జున్, MPP లు నందినిరవితేజ, సునీత కృపయ్య, కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, గంధం రామకృష్ణ, కొమ్మ నాగలక్ష్మి, పందిరి అనిత, గుంజా శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగు నాయక్, ఎంపీటీసీలు బెజ్జం సాయి, జగ్గారెడ్డి చలపతిరావు, కిరణ్, అంజిరెడ్డి , శంకర్ రెడ్డి , మెడ సురేందర్ రెడ్డి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు హజార్, ఉపాధ్యక్షులు సిద్దు నాయక్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు పోలగాని వెంకటేష్ గౌడ్, బుసిరెడ్డి వెంకటరెడ్డి, వార్డు ఇన్చార్జులు కోడిరెక్క ఇంద్ర కుమార్, మేకల శ్రీనివాస్, వెంకటకృష్ణ ,యాదయ్య గౌడ్, బలరామ కృష్ణ గౌడ్, అబ్దుల్లా , నాగిరెడ్డి, గోవర్ధన చారి, అమృతారెడ్డి, శ్రీనివాస్ , ఉబ్బపల్లి కాశయ్య , హలీం , చక్రి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : ముందే చెప్పినట్లుగా.. ముగ్గురిని ఇంటికి పంపారు..!

మరిన్ని వార్తలు