Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsతెలంగాణనారాయణపేట జిల్లా

Social media : ఇకపై అలాంటి పోస్టులు షేర్, ఫార్వర్డ్ చేస్తున్నారా.. కేసుల్లో ఇరుక్కున్నట్లే..!

Social media : ఇకపై అలాంటి పోస్టులు షేర్, ఫార్వర్డ్ చేస్తున్నారా.. కేసుల్లో ఇరుక్కున్నట్లే..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం మరియు ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని District SP యోగేష్ గౌతమ్ హెచ్చరించారు.

శుక్రవారం జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ రాజకీయంగాను, కుల, మత, ప్రాంతీయంగాను ప్రజల భద్రతకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిగా ఉన్న వాటిని సామాజిక మాద్యమాలలో షేర్ చేసిన చట్టప్రకారం తీవ్రమైన చర్యలు ఉంటాయని తెలిపారు.

ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, వాట్సప్ గ్రూపులలో ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా, ఒక వర్గానికి కించపరిచే విధంగా ఉన్న వీడియోలు, ఫోటోలు పోస్టులు చేసిన, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసిన ఆ గ్రూపు అడ్మిన్ నీ బాధ్యుడిగా చేస్తూ, ఫార్వర్డ్ చేసిన వారిపైన కేసులు నమోదు నమోదు చేస్తామని తెలిపారు.

జిల్లాలో ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడే వారిని అనుక్షణం పోలీసులు గమనిస్తూ ఉండాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. కావున ఈ తరహా నేరలకు పాల్పడే వారిని వెంటనే పట్టుకొని అట్టి వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు.

పోలీసులు నిరంతరం 24/7 పరిశీలిస్తుంటారని తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు చేసిన, ఫార్వర్డ్ చేసిన జాగ్రత్తగా గమనించి చేయాలని ఎస్పీ సూచించారు.

LATEST UPDATE : 

BIG BREAKING : నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే మహిళ ప్రసవం..!

Ration Cards : తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్..!

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉచిత ఉపాధి, నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం.. శిక్షణ కాలంలో భృతి..!

మరిన్ని వార్తలు