తాండ గ్రామంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

ఎఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను తాండ్ర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కాయితి ఆశాదీప్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

తాండ గ్రామంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

యువ నాయకుడు కాయితి ఆశాదీప్ రెడ్డి

నాగర్ కర్నూలు జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి, మనసాక్షి :

ఎఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను తాండ్ర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కాయితి ఆశాదీప్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసి సాయంత్రం గ్రామంలో కేక్ కట్ చేసి గ్రామస్తులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు

ALSO READ : BREAKUNG : తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరెవరికి ఏ శాఖలు..!

అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను కచ్చితంగా అమలు చేస్తుందని చెప్పారు. ఆరు గ్యారెంటీలో భాగంగా శనివారం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ఆశదీప్ రెడ్డి తాండ్ర గ్రామంలో ప్రారంభించారు.

అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల రూపాయల వరకు పెంపు కార్యక్రమం కూడా ప్రారంభమైనట్లు చెప్పారు కాంగ్రెస్ పార్టీ హయములు పేద మధ్యతరగతి ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం.. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్.. మార్గదర్శకాలు ఇవి..!