స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందిన రోహిత్ సింగ్ కు ఘన సన్మానం

స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందిన రోహిత్ సింగ్కు ఘన సన్మానం

సన్మానించిన జర్నలిస్టులు … హాజరైన రెవెన్యూ, అధికార సిబ్బంది. 

మిర్యాలగూడ, అక్టోబర్ 10, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ ఇటీవల స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ జర్నలిస్టులు మొహమ్మద్ అస్లం, మల్లె నాగిరెడ్డిల ఆధ్వర్యంలో సోమవారం మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయంలో రోహిత్ సింగ్ కు ఘనంగా సన్మానం చేశారు.

అనంతరం స్వీట్లు తినిపించారు. ఈ సన్మాన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రంగ శ్రీనివాస్, జంగా లక్ష్మణ్ యాదవ్, బొంగరాల మట్టయ్య, ఉర్దూ జర్నలిస్టులు సయ్యద్ నాసరుద్దీన్, మహమ్మద్ రఫీ, ఫోటో జర్నలిస్ట్ ధనుంజయ రెడ్డి తోపాటు

ఆర్డీవో కార్యాలయ డిఏఓ రాద, డిప్యూటీ తహసిల్దార్ ఎండి హాజీ, ల్యాండ్ సర్వే డి.ఐ. బాలాజీ, సీనియర్ అసిస్టెంట్లు ఎండి జమాల్, కల్పన, సుహాసిని, జూనియర్ అసిస్టెంట్లు అఖిల్, హారిక తదితరులు పాల్గొన్నారు.