Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

శ్రీరామ్ సాగర్ జలాలు విడుదల..!

తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని పలు మండలాలకు శ్రీరామ్ సాగర్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేస్టు జలాలు  విడుదల చేశారు.

శ్రీరామ్ సాగర్ జలాలు విడుదల..!

తుంగతుర్తి, మన సాక్షి :

తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని పలు మండలాలకు శ్రీరామ్ సాగర్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేస్టు జలాలు  విడుదల చేశారు. జనగాం జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద సాయంత్రం నాలుగున్నర గంటలకు 2.5 మీటర్ల ఎత్తులో గేట్లను ఎత్తి 15 10 క్యూసెక్కుల నీళ్లను జిల్లా వైపు వదిలారు.

సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలకు మెయిన్ కాలువల ద్వారా నీటిని వదిలారు. నీళ్లు బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోకి వస్తున్నాయి. ఇక 0.480 టీఎంసీలు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం గల కొడకండ్ల వద్ద ఉన్న రిజర్వాయర్ పూర్తిగా నిండి సామర్థ్యం సరిపోను నీటిని పైనుంచి వదిలారు.

మరిన్ని వార్తలు